చైనా, థాయ్‌లాండ్‌తో సహా ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేయడానికి ముందు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల కోసం సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత, నటి ఊర్వశి రౌతేలా తాను 'ప్రార్థిస్తున్నాను' అని పోస్ట్ చేసింది.
ఇండియాతో సరిహద్దు పంచుకునే మయన్మార్ దేశంలో మరో సంచలనం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా అంతర్గత కలహాలతో అట్టుడుకుతూ, ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో మాజీ నాయకురాలు, హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీ జైలులో మగ్గుతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున అహ్మదాబాద్ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ఆమె మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ ఎపిసోడ్.
న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, విప్ సునీత, ఆలయ ఈవో గీతారెడ్డిలు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.