Gali Janardhan Reddy New Party: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరును ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీతో బంధంపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను బీజేపీ సభ్యుడిని కాదని.. కానీ చాలా మంది తాను ఆ పార్టీకి చెందిన వాడినే అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆ ప్రచారానికి ఈ రోజు తెర దించుతున్నానని.. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Mann ki Baat: ఈ ఏడాది చివరి మన్ కీ బాత్.. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?
‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరుతో ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి పల్లెకు, గడప గడపకు వెళ్తానని ఆయన చెప్పారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని.. కర్ణాటక సంక్షేమ రాజ్యంగా మారుతుందని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు ఆంక్షలను ప్రస్తావిస్తూ.. 12 ఏళ్లు వనవాసం చేశానని ఆయన అన్నారు. అండగా ఉంటామని శ్రేయోభిలాషులు, బళ్లారి ప్రజలు మాట ఇచ్చారని.. అందుకే రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.