Hailstorm: అస్సాంలోని దిబ్రూఘర్‌లో మంగళవారం పలుచోట్ల వడగళ్ల వాన కురిసి జిల్లావ్యాప్తంగా 200కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. సోమవారం అర్థరాత్రి, మంగళవారం తెల్లవారుజామున దిబ్రూఘర్‌లోని టింగ్‌ఖాంగ్, నహర్‌కటియా, మోరన్, ఇతర ప్రాంతాలను వడగళ్ల వాన తాకింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
“ఈ వడగళ్ల వాన జిల్లాలో విస్తృతమైన నష్టానికి దారితీసింది. మోరన్ సబ్-డివిజన్‌లో ప్రాథమిక అంచనా ప్రకారం, 37 గ్రామాల్లో 210 ఇళ్లు దెబ్బతిన్నాయి” అని దిబ్రూగఢ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని ఆదేశించామని, నష్టపోయిన వారికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. “తీవ్రమైన వడగళ్ల వాన కారణంగా, మోరన్, టింగ్‌ఖాంగ్ రెవెన్యూ సర్కిల్‌ల పరిధిలోని అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి” అని ఆయన ట్విట్టర్‌లో రాశారు.
Terror Attack Averted: తప్పిన భారీ ఉగ్రదాడి.. 15 కిలోల పేలుడు పదార్థాలు నిర్వీర్యం
మంచుతో కప్పబడిన రోడ్లు, చెట్లను చూపించే వీడియోను ముఖ్యమంత్రి శర్మ కూడా పంచుకున్నారు. ఈరోజు అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Due to a severe hailstorm, several houses under Moran and Tingkhang revenue circles have been reportedly damaged.
Have instructed officials to make a detailed assessment of the damages caused. Government is extending all possible help to all those affected by it. pic.twitter.com/MgwklKBBAG
— Himanta Biswa Sarma (@himantabiswa) December 27, 2022