ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.
క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి.
మూగజీవుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు గుర్తు తెలియని దుండగులు. తమ క్రూరత్వాన్ని చిన్న బుజ్జి కుక్కపిల్లలపై చూపించారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో రెండు కుక్క పిల్లలను చంపినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్‌లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు.
యుద్ధం ప్రారంభమై కొన్ని నెలలైనా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్థలాలు, సముదాయాల లక్ష్యంగా అటాక్ చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ విద్యుత్ సముదాయాలే లక్ష్యంగా రష్యా దాడికి తెగబడింది.
స్వల్పం విరామం తర్వాత టీమిండియా మళ్లీ బరిలోకి దిగనుంది. జనవరి 3 నుండి ప్రారంభమయ్యే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది.
దక్షిణ సూడాన్‌లోని తూర్పు జోంగ్లీ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు జరిగిన జాతి పోరులో 56 మంది మృతి చెందారు. న్యూర్ కమ్యూనిటీకి చెందిన యువకులు మరొక జాతికి చెందిన వారిపై చేసిన దాడిలో చాలా మంది మరణించారని స్థానిక అధికారి మంగళవారం వెల్లడించారు.
పరీక్షల్లో కాపీ కొట్టడం, మోసం చేయడం సమాజాన్ని, విద్యావ్యవస్థను నాశనం చేసే మహమ్మారి లాంటిదని, అన్యాయమైన మార్గాలను ఉపయోగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
భారత్‌కు చెందిన మద్రాస్ ఐఐటీ, ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన కొలంబియా వర్సిటీ పరిశోధకులు "GNB1 ఎన్సెఫలోపతి" అనే అరుదైన జన్యు మెదడు వ్యాధిని అధ్యయనం చేస్తున్నారు.