Cambodia Fire: కంబోడియా-థాయ్‌లాండ్ సరిహద్దులోని క్యాసినో కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బుధవారం అర్ధరాత్రి థాయ్‌లాండ్, కంబోడియా సరిహద్దు నగరమైన పాయ్‌పట్‌లోని గ్రాండ్ డైమండ్ హోటల్ క్యాసినోలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
Heeraben Modi: హీరాబెన్ మోడీ అంత్యక్రియలు పూర్తి.. మాతృమూర్తి పాడె మోసిన ప్రధాని మోడీ
ఆ సమయంలో అక్కడ 1,000 మంది సందర్శకులు, 500 మంది ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో క్యాసినో 12 గంటల పాటు మంటల్లోనే చిక్కుకుని ఉంది. అగ్నిమాపక సిబ్బంది గురువారం మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కంబోడియన్ అధికారుల నుంచి వచ్చిన అత్యవసర కాల్‌లకు ప్రతిస్పందించిన థాయ్ పోలీసులు స్పందించి చాలా మందిని రక్షించారు. సుమారు 700 మంది థాయ్ పౌరులు రక్షించబడ్డారు. గాయపడిన వారిని థాయ్‌లాండ్‌లోని ఆసుపత్రులకు తరలించారు.