Nitin Gadkari: మహారాష్ట్రలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి శనివారం రెండు బెదిరింపు కాల్‌లు వచ్చాయని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11.30, 11.40 గంటలకు కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11.30, 11.40 గంటలకు రెండు బెదిరింపు కాల్‌లు వచ్చాయని పోలీసులు తెలిపారు.
Hoax Call: రైల్వే పోలీసుపై కోపం.. పుణె రైల్వేస్టేషన్‌కు బూటకపు కాల్
సమాచారం అందుకున్న నాగ్‌పూర్ పోలీసులు హుటాహుటిన ఆయన కార్యాలయానకి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ కాల్స్‌పై పూర్తి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన కార్యాలయానికి భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.
గుర్తు తెలియని వ్యక్తి మూడుసార్లు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. కార్యాలయాన్ని పేల్చేస్తానని కూడా బెదిరించాడు. నితిన్ గడ్కరీ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాలర్ వాయిస్ రికార్డింగ్ విశ్లేషిస్తున్నామని నాగ్‌పూర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ మదనే తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం నాగ్‌పూర్‌లోని ఖమ్లా చౌక్‌లో ఉంది. ఇది ఆయన ఇంటికి 1 కిలోమీటరు దూరంలో ఉంది.