Uttarakhand Minister: ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిదానం అనేది గాంధీ కుటుంబానికి చెందిన గుత్తాధిపత్యం కాదని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలేనని మంత్రి గణేష్ జోషి మంగళవారం అన్నారు. రాహుల్ గాంధీ తెలివితేటలపై జాలిపడుతున్నానని ఆయన ఎద్దేవా చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్‌ల బలిదానాలు జరిగాయన్నారు. గాంధీ కుటుంబ సభ్యులతో జరిగినవి ప్రమాదాలేనని.. బలిదానాలకు, ప్రమాదాలకు మధ్య వ్యత్యాసం ఉందని జోషి అన్నారు.
శ్రీనగర్‌లో తన భారత్ జోడో యాత్ర ముగింపులో కాంగ్రెస్ నాయకుడి ముగింపు ప్రసంగం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఒకరు తమ తెలివితేటల స్థాయిని బట్టి మాత్రమే మాట్లాడగలరని ఆయన విలేకరులతో అన్నారు. రాష్ట్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న జోషి.. జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ యాత్రను సజావుగా ముగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఘనత కూడా ఇచ్చారు. ఆ ఘనత ప్రధానమంత్రికే చెందుతుందని.. ఆయన నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండకపోతే, రాహుల్‌గాంధీ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉండేవారు కాదన్నారు. బీజేపీ నేత మురళీ మనోహర్ జమ్మూకశ్మీర్‌లో హింస ఉద్ధృతంగా ఉన్నప్పుడు లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారని జోషి చెప్పారు.
Shanti Bhushan: కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్య గురించి తనకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, హింసను ప్రేరేపించే వారు ఆ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అన్నారు.హింసను ప్రేరేపించే మోదీజీ, అమిత్ షాజీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లాంటి వాళ్లకు ఈ బాధ ఎప్పటికీ అర్థం కాదు.. ఆర్మీ మనిషి కుటుంబానికి అర్థం అవుతుందన్నారు.పుల్వామాలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబానికి అర్థం అవుతుందన్నారు. కశ్మీరీలు కూడా అర్థం చేసుకుంటారని రాహుల్ గాంధీ అన్నారు.