ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు.
గుంటూరులో గ్యాంగ్ మూవీ సీన్ రిపీట్ అయింది. ఆ చిత్రంలో లాగే ఐటీ అధికారులమంటూ ఓ మహిళను బెదిరించి పెద్ద మొత్తంలో ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగ్‌రౌలీ జిల్లాలో పెళ్లి బృందం సభ్యులతో నిండిన బస్సు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తుఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా అమృత్‌పాల్ మద్దతుదార్లు వేలాది మంది తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్‌స్టేషన్ పైకి దండెత్తారు.