New COVID-19 Variant: ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త కొవిడ్-19 వేరియంట్‌ను కనుగొన్నట్లు నివేదించింది. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉప-వేరియంట్‌లు ఉన్నాయి. వీటని BA.1, BA.2 అని పిలుస్తారు. ఇటీవల బెన్ గురియన్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షలో ఈ వేరియంట్ గుర్తించబడింది. మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం.. కొవిడ్ -19 యొక్క ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచంలో మరెక్కడా గుర్తించబడలేదు. ఇప్పటివరకు కనుగొనబడిన ఈ రెండు కేసులు జ్వరం, తలనొప్పి,కండరాల నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను మాత్రమే ప్రదర్శించాయని, అందువల్ల ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం లేదని ప్రకటన వివరించింది.
ఈ కొత్త వేరియంట్ ఫలితంగా వచ్చే ఏవైనా తీవ్రమైన కేసుల గురించి ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ ప్రజారోగ్య విభాగం అధిపతి డాక్టర్ షారోన్ అల్రోయ్-ప్రీస్ అన్నారు. ఇజ్రాయెల్ 9.2 మిలియన్ల జనాభాలో, నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పటికే మూడు డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను పొందారు. ఈ రోజు వరకు దేశంలో దాదాపు 1.4 మిలియన్ల కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, 8,244 మరణాలు సంభవించాయి. కొవిడ్-19 ఆంక్షలు సడలిస్తున్నందున టీకాలు వేయని పర్యాటకులు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ గత నెలలో ప్రకటించారు. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.
Read Also: World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
డిసెంబర్ 2020లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి దేశాలలో ఇజ్రాయెల్ కూడా ఉంది. అయితే, ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల 2021 నవంబర్‌లో దాని సరిహద్దులను తిరిగి తెరవడానికి చేసిన మునుపటి ప్రయత్నం విఫలమైంది. దీని వలన వాటిని కొన్ని రోజుల్లోనే మళ్లీ మూసివేయవలసి వచ్చింది.ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులలో గణనీయమైన పెరుగుదల ఉన్నందున, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులతో పాటు, కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్ అందించబడుతుందని ప్రకటించింది.