Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి ఢిల్లీని భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రజలను ఆ భయం వెంటాడుతున్న సమయంలోనే మరోసారి భూకంపం సంభవించడం గమనార్హం. దేశ రాజధానిలో బుధవారం 2.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. సాయంత్రం 4:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం పశ్చిమ ఢిల్లీలో ఉందని, ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
Read Also: PM Modi: కరోనా కథ ఇంకా ముగియలేదు, అప్రమత్తంగా ఉండాలి.. ప్రధాని కీలక సూచనలు
మంగళవారం రాత్రి 6.6 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం నగరాన్ని కుదిపేసింది. దాని కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 156 కిలోమీటర్ల లోతులో ఉంది. మంగళవారం ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రికర్ట్ స్టేల్ పై 6.6 గా నమోదయింది. రాత్రి 10.20 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఢిల్లీలోని పలుచోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. ఈ రోజు ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే రాజధాని ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.