Crime News: అనుమానం పెనుభూతమై.. గొంతు నులిమి భార్య హత్య.. శవాన్ని ముక్కలు చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. ఈ దారుణం బెంగాల్‌లో బిష్ణుపుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ముర్షీదాబాద్‌లో నివాసముంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న నిందితుడు అలీమ్ షేక్‌కు పన్వార మండలానికి చెందిన ముంతాజ్ షేక్‌కు దాదాపు 20 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పెళ్లి తర్వాత అలీమ్ తన అత్తమామలు ఉన్న బిష్ణుపుర్‌లోని చిట్‌భాగి ప్రాంతానికి నివాసం మార్చారు. అలీమ్ సర్దా గార్డెన్స్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ముంతాజ్ సమాలీ ప్రాంతంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసేది. రోజులాగే మంగళవారం ఉదయం పనికి వెళ్లేందుకు ముంతాజ్ తన భర్త అలీమ్‌తో కలిసి బయలుదేరింది. ఆరోజు రాత్రైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అలీమ్ ఎప్పటిలాగే రాత్రి తన అత్తమామల ఇంటికి వచ్చాడు. అయితే బుధవారం ఉదయం వరకు ముంతాజ్ కనిపించకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Acid Attack: కోర్టు ఆవరణలోనే భార్య ముఖంపై యాసిడ్‌తో దాడి
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
రంగంలోకి దిగిన పోలీసులు అలీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే భార్య ముంతాజ్‌ను హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు భార్యను హత్య చేసి ఆమెను ముక్కలుగా నరికాడు. అనంతరం దగ్గర్లోని ఓ చెరువు వద్ద వాటిని పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. పాతిపెట్టిన చోటుకు హంతకుడు అలీమ్‌ను తీసుకెళ్లి మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై ఉన్న అనుమానంతోనే హత్య చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు అలీమ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఈ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు