PM Modi: బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కి.మీ మేరకు వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించి, బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది, మెట్రో నిర్మాణ కార్మికులు, విద్యార్థులతో సహా వివిధ వర్గాల ప్రజలతో సంభాషించారు. ప్రధానమంత్రి టికెట్ కౌంటర్ వరకు నడిచి, ఆపై మెట్రో రైలు ఎక్కేందుకు సాధారణ ప్రయాణీకుడిలాగానే ప్రవేశ ద్వారం గుండా వెళ్లారు. ఆయన వెంట కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు ఉన్నారు.
Read Also: Delhi excise case: సిసోడియాకు ఎదురుదెబ్బ… బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఈ సెక్షన్ బైయప్పనహళ్లి నుంచి వైట్‌ఫీల్డ్ స్టేషన్ వరకు పనిచేసే తూర్పు-పశ్చిమ కారిడార్ (పర్పుల్ లైన్)కి తూర్పు పొడిగింపు అని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న 15.81 కి.మీ పొడిగింపులో కేఆర్ పురం నుండి వైట్‌ఫీల్డ్ వరకు 13.71 కి.మీ సెక్షన్‌ను శనివారం ప్రారంభించారు. ఈ మార్గంలో ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గించి, రహదారి ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.బెంగళూరు మెట్రో కొత్త లైన్ టెక్ పార్కులు, ఎగుమతి ప్రమోషన్ ఇండస్ట్రియల్ ఏరియాలు, మాల్స్, హాస్పిటల్స్, అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలలో పనిచేస్తున్న ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది బెంగళూరు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేయబడిన ఆరు కోచ్‌ల ఐదు రైళ్లను ఈ మార్గంలో నడుపుతామని, మరిన్ని రైళ్లను బ్యాకప్‌గా ఉంచుతామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!