రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు వచ్చిన భార్య, కోడలిని గాయపరిచాడు.
మానవులంతా పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్‌కు వచ్చింది. దాన్ని ఆచరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది ఆయన నమ్మకం.
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం.
జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండలం సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ జరిగింది. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్లకురుమలు అడ్డుకున్నారు.
కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలపై హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి నేతృత్వంలో సీబీఐ అధికారులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితం ఈడీ అధికారులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్‌ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
నేటి యుగంలో ఫోన్‌లు నిత్యావసరంగా మారాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యక్తులకు కాల్ చేయడం కోసం మాత్రమే కాదు, అది అందించే అనేక రకాల ఫీచర్లు, సేవలను ఉపయోగించడం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు.