చిలకలూరిపేట సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియని బాబులు అంటూ ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ మాత్రమే వారికి తెలుసని ఆయమ మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గెలుపు ఉండబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ 'ఫ్యామిలీ డాక్టర్' విధానాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక విధానాన్ని ప్రారంభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'ఫ్యామిలీ డాక్టర్' విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
వైసీపీ నుంచి సస్పైండెన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హంగామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్‌ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు.
సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. రైల్వేశాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు హత్యకు తమ్ముడి వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.