Wife Killed Husband: భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తల బంధంలో ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే కలిసిమెలిసి ఉండాల్సిన భార్యాభర్తలు.. బద్ద శత్రువులుగా మారిపోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.
Read Also: First Mobile Phone Call: సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదటి మొబైల్ కాల్.. మాట్లాడింది వీరే..
కొన్ని కొన్ని ఘటనల్లో కొంతమంది క్షణికావేశంలో కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటే మరికొన్ని ఘటనల్లో పరాయి వ్యక్తుల మోజులో పడి అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇక కట్టుకున్న వారిని హత్య చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఏది ఏమైనా ఇలా కడవరకు తోడుంటామని ప్రమాణం చేసిన వారే కాలముడిగా మారిపోతున్న నేపథ్యంలో.. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి తరహా ఘటనే 2020లో జరిగింది. ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 2020 ఫిబ్రవరిలో పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తను చంపిన కేసులో భార్యకు జీవిత ఖైదు విధిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. పదివేల రూపాయల జరిమానా కూడా విధించింది.