Clash in Land Dispute: జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండలం సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ జరిగింది. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్లకురుమలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇరువర్గాలు కర్రలతో దాడికి దిగాయి. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Hindu religious procession: హౌరాలో రామనవమి ర్యాలీ.. పిస్టల్‌తో వ్యక్తి హల్ చల్
అధికార పార్టీకి సంబంధించిన తరిగొప్పుల తెరాస నాయకులు తమపై దౌర్జన్యం చేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన భూమిలో ఫెన్సింగ్ వేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మా భూమిలో ఫెన్సింగ్ ఎలా వేస్తారని అడిగిన పాపానికి కర్రలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.