పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారని వెల్లడించారు. చీఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు.
రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తోందని ఆయన విమర్శించారు.
పెద్దపల్లి జిల్లాలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది.
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలంబ్రాలకు ఈ ఏడాది ఊహించని విధంగా స్పందన లభించింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దాదాపు 20వేల మంది అధికంగా తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు.
పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనం రేపింది. ఇటీవల పోస్కో చట్టం నేర ఆరోపణతో ఏటూరునాగారానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ క్రమంలో విపక్ష నేతలతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పిచ్చోడని.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడని.. రేవంత్ రెడ్డికి మెదడు లేదని ఆయన విమర్శించారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్ వారీగా, డివిజన్ వారీగా మంజూరు అవుతాయని.. వాటిలో కొన్ని సార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది.
బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు.
రష్యా తూర్పు తీరంలో సోమవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీ సంభవించలేదని, తక్షణ ప్రాణనష్టం లేదా విధ్వంసం లేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.