Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. యూపీలోని జలౌన్‌లో సోమవారం ఇద్దరు ముసుగులు ధరించిన దుండగులు పట్టపగలు ఓ మహిళను హత్య చేశారు. మహిళ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా, రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమెపై కాల్పులు జరిపారు. మృతురాలిని ఐత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధా గ్రామానికి చెందిన 22 ఏళ్ల రోష్ని అహిర్వార్‌గా గుర్తించారు.
Read Also: Fake IAS Officer: ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!
ఆమె బీఏ పరీక్షకు హాజరయ్యేందుకు సోమవారం రామ్ లఖన్ పటేల్ కాలేజీకి వెళ్లింది. పరీక్ష ముగించుకుని రోష్ణి తన ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పిస్టల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వారిలో ఓ వ్యక్తి ఆమె తలపై కాల్చాడు. కొందరు స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. నిందితులు పిస్టల్‌ను అక్కడికక్కడే వదిలేశారు.నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎరాజ్ రాజా తెలిపారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.