పరిశ్రమల స్థాపనకు భారత్‌లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఫోరమ్ చైర్మన్, జేసీ2 వెంచర్స్ వ్యవస్థాపకుడు జాన్ ఛాంబర్స్ అధ్యక్షత వహించారు. ఫైర్ సైడ్ సంభాషణలో ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విరాట్ భాటియా అడిగిన పలు…
వైసీపీలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరబోతున్నారా? వెళ్ళాలి... వెళ్ళిపోవాలంటూ... మనసు తెగ లాగేస్తోందా? ఎప్పుడెప్పుడు గ్లాస్ పట్టుకుందామా అని ఆయన ఆత్రంగా ఎదురు చూస్తున్నా... గతం వెంటాడుతోందా? నాయకత్వం సంగతి తర్వాత ముందు జనసైనికులే అడ్డుకుంటారన్న భయం ఉందా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయన మనసు లాగుడు మేటర్?
ఓరుగల్లు కాంగ్రెస్ పోరుకు కేరాఫ్ అవుతోందా? మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మొదలైన వ్యవహారం మొత్తం పార్టీకే చుట్టుకుంటోందా? ఏకంగా అధికార పార్టీ కేడరే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడాన్ని ఎలా చూడాలి? మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కొత్త వివాదానికి తెర తీశారా? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.
లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా అంటూ అడిగారు
నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కానూరులోని ఏపీఎండీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పూర్తి పారదర్శకంగా పాలసీని అమలు చేసి చూపించామన్నారు. అత్యంత పకడ్బందీగా షాపుల కేటాయింపు జరిగిందన్న ఆయన.. గత ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో చేసిన దుర్మార్గాలకు, స్కాములకు నేటితో తెరదించామన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామల రావు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలెర్ట్ అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లోస్ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సోమశిల రిజర్వాయరుకు గతంలో ఎన్నడు రానంత వరద ఈ సారి వస్తోందన్నారు.
రతన్ టాటా వారసత్వాన్ని ఏపీ నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతిలో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించనున్నామని ఆయన తెలిపారు. రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఏపీలో ఈ నెల 22, 23 తేదీల్లో జరుగనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రూ.5.54 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.