Deputy CM Pawan Kalyan: ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరం
- ఏనుగుల సంచారం వల్ల రైతు దుర్మరణం
- ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల సంచారం వల్ల రాజారెడ్డి అనే రైతు దుర్మరణం పాలైన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని అటవీ శాఖ అధికారులు పరామర్శించి భరోసా ఇవ్వాలని ఆదేశించారు. మృతుని కుటుంబానికి అందాల్సిన నష్ట పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అందించే కుంకీ ఏనుగులు వీలైనంత త్వరగా మన రాష్ట్రానికి వచ్చేలా చూడాలన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు సర్కారు షాక్.. !
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు.. పుంగనూరు నుండి పీలేరు వైపునకు వెళ్తున్న ఏనుగుల గుంపు.. పీలేరు సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.. ఏకంగా 15 ఏనుగులు గుంపు మామితోటలను ధ్వంసం చేసింది.. అయితే, మామిడి తోపు యజమాని రాజారెడ్డిని ఏనుగులు తొక్కి చంపేశాయి. దీంతో, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరోవైపు ఏనుగుల గుంపు సృష్టించిన విధ్వంసంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు.. ఇక, ఆ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు ఫారెస్ట్ అధికారులు.కాగా, ఇప్పటికే ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిసారించిన విషయం విదితమే.. దీనిపై ఏపీ-కర్ణాటక మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!