Mark Zuckerberg: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన మొదటి జియు-జిట్సు టోర్నమెంట్‌లో పాల్గొని బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. ఫేస్‌బుక్‌లో టోర్నమెంట్ చిత్రాలను పంచుకుంటూ.. “నా మొదటి జియు జిట్సు టోర్నమెంట్‌లో పోటీ పడి గెరిల్లా జియు జిట్సు జట్టు కోసం కొన్ని పతకాలు సాధించాను. నాకు శిక్షణ ఇచ్చినందుకు డేవ్ కమరిల్లో, ఖై వు, జేమ్స్ టెర్రీకి ధన్యవాదాలు!” అంటూ మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు. షేర్ చేసినప్పటి నుంచి ఆయన పోస్ట్‌కు 1.5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చాలా ప్రతిభ ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు. టెక్ టైకూన్ అయిన మార్క్ జుకర్‌బర్గ్ తన మొదటి జియు-జిట్సు టోర్నమెంట్‌లో పోటీపడి బంగారు, వెండి పతకాలను గెలుచుకోవడం విశేషం.
Read Also: Gujarat Titans Vs Lucknow Super Giants Live: అన్నదమ్ముల మధ్య సవాల్.. గెలుపెవరిది?
మార్క్ జుకర్‌బర్గ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) శిక్షణ తీసుకున్నట్లు గత సెప్టెంబర్‌లో నివేదించబడింది. ఆయనకు శిక్షణ ఇచ్చే శిక్షకుడు రింగ్‌లో “సైలెంట్ కిల్లర్”గా మార్క్ జుకర్‌బర్గ్‌ను అభివర్ణించాడు. బిలియనీర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసాడు. దీనిలో అతను ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్, జియు-జిట్సు బ్లాక్ బెల్ట్ అయిన ఖై వుతో కలిసి కనిపించారు. ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఖై వును తన శిక్షకుడిగా అభివర్ణించారు.