Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి.. పలువురికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spurious Liquor: తమిళనాడులోని విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు. విల్లుపురం జిల్లా మరక్కనం సమీపంలోని ఎక్కియార్‌కుప్పంకు చెందిన ఆరుగురు ఆదివారం మృతి చెందారు. చెంగల్‌పట్టు జిల్లాలోని మదురాంతగంలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆదివారం ఒక జంట మృతి చెందిందని, అన్నీ అక్రమ మద్యం సేవించడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. “ప్రస్తుతం రెండు డజన్ల మందికి పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. వారు బాగానే ఉన్నారు.” అని అధికారులు చెప్పారు.
ఈ సంఘటన తర్వాత ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్ కన్నన్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు. మొత్తం 10 మంది బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్థాలతో కూడిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చని చెప్పారు.తమిళనాడులోని నార్త్ జోన్‌లో రెండు వేర్వేరు కల్తీ మద్యం మరణాలు నమోదయ్యాయని, ఈ రెండు ఘటనల మధ్య సంబంధమున్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అయితే సాధ్యమయ్యే లింక్‌లను కనుగొనడానికి పోలీసులు కోణం నుండి దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. “రెండు నకిలీ మద్యం సంఘటనలు నమోదయ్యాయి. ఒకటి చెంగల్పట్టు జిల్లాలో, మరొకటి విల్లుపురం జిల్లాలో జరిగాయి. విల్లుపురం జిల్లా పరిధిలోని మరక్కనం సమీపంలో గల ఎక్కియార్‌కుప్పం గ్రామంలో నిన్న 6 మంది వాంతులు, కంటి సమస్యలు, వాంతులు, తల తిరగడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం మేరకు, పోలీసుల బృందం గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన ఆసుపత్రికి చేర్చింది. ఇందులో ఇద్దరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉండగా చికిత్సకు స్పందించకపోవడంతో నలుగురు మరణించారు. 33 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ”అని విలేకరుల సమావేశంలో ఐజీ తెలిపారు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో విల్లుపురం జిల్లాలో మృతుల సంఖ్య ఆరుకు చేరగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
Also Read
Read Also: Terror Funding Case: ఉగ్రవాదులకు నిధుల కేసు.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు
“ఈ సంఘటనకు సంబంధించి, అమరన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో మిథనాల్ ఉనికిని నిర్ధారించడానికి దానిని ల్యాబ్‌కు పంపారు” అని ఐజీ తెలిపారు. సంబంధిత అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విల్లుపురం మరక్కాణంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశామని, అలాగే చెంగల్పట్టు ఘటనకు సంబంధించి ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశామని ఐజీ తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు