Molesting Air Hostess: ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు. దుబాయ్-అమృత్‌సర్ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లోని కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్, ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి శనివారం ఆమెను వేధించాడని పోలీసులు తెలిపారు. “ఈ ఘటనను ఎయిర్ హోస్టెస్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి” అని పోలీసులు తెలిపారు.
Read Also: Drinking Alcohol: గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించినందుకు మహిళ హత్య
సిబ్బంది ఈ విషయాన్ని అమృత్‌సర్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయగా, ఎయిర్‌లైన్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితుడిని ఇక్కడి శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.