*నేడు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం
ఎట్టకేలకు కర్ణాటక సీఎం పీఠముడి వీడింది. సీఎంగా సిద్దరామయ్య నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30కి ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యతోపాటు సీఎం పదవికి పోటీ పడ్డ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీకి చేరుకుని కొత్త మంత్రివర్గంలో చేర్చుకోవాల్సిన ఎమ్మెల్యేల పేర్లు, వారికి కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించారు. సిద్ధూ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం దిగిరానుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సూర్జేవాలా సహా పార్టీ అగ్రనాయకులంతా బెంగళూరుకు విచ్చేయనున్నారు. అంతే కాకుండా కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్, బిహార్ సీఎం నీతీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకు ఆహ్వానాలు అందినప్పటికీ హాజరుకావడం లేదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు వివిధ పార్టీ లీడర్లు పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్‌పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, బిహార్ డిప్యూటీసీఎం తేజస్వీయాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్బుల్లా హాజరుకానున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను డీకే శివకుమార్ దగ్గరుండి పరిశీలించారు. పోలీసులు అధికారులు, ఇతర యంత్రాంగంతో మాట్లాడి సూచనలు సలహాలు ఇచ్చారు. భారీగా జనం కూడా వచ్చే ఛాన్స్ ఉన్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు హితవు పలికారు. 2013లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
*పాతబస్తీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. హుస్సేనియాలం పోలీస్టేషన్ పరిధిలోని ఎయిర్‌కూలర్ షాప్, ఆటో విడిభాగాలోని 2 షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో ఇద్దరు చిక్కుకున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు కూడా మంటలను అదుపు చేసేందుకు సహకరించారు. స్థానికులు ఇళ్ల నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఇద్దరిని కాపాడి సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రాత్రంతా శ్రమించి మంటలను అదుపుచేశారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై అధికారులు ఆరాధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓల్డ్ బస్తీ మీర్ ఆలం పార్కులో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఫర్నీచర్ గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. గోదాములో మంటలు వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి చుట్టుపక్కల భవనాలకు వ్యాపిస్తున్నాయి. పక్కనే ఉన్న రెండు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో ఇళ్లలోని ప్రజలు ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పక్కనే ఉన్న ఇతర నివాస గృహాల నుంచి కూడా స్థానికులు పరుగులు తీస్తున్నారు. ఇళ్ల మధ్యలో అక్రమ గొండలు ఏర్పాటు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. పాతబస్తీలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారు. అధికారులు అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్లమంది తిరుమలకు వెళ్తుంటారు. శ్రీనివాసుడికి భక్తితో ముడుపులు, కానుకలు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠ వాసుడిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు. ప్రతిరోజు తిరుమలలోని ఆ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం రికార్డుస్థాయిలో 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్ష ఫలితాల విడుదల నేపథ్యంలో భారీగా తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం ఆలయంలో స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఈవో ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. దీంతో స్వామివారి అభిషేక సేవ పూర్తి అయ్యే సరికి గంటన్నర సమయం ఆదా అయింది. ఈ గంటన్నర సమయాన్ని భక్తుల సర్వదర్శనం కోసం టీటీడీ కేటాయించింది. దీనితో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం రోజున శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలు దాటింది. వేసవిలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని గురువారం తిరుప్పావడ సేవను కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడి నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఇవాళ.. స్వామి వారి దర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చింది.
*ఆ సెక్షన్ ఉపయోగించి రూ. 2000 నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 2000 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం 2000 నోట్లను డినామినేషన్ చేసింది. 2016 నవంబర్ లో 2 వేల నోట్లు ప్రవేశపెట్టారు. ప్రధానంగా చలామణిలో ఉన్న మొత్తం 2000 బ్యాంకు నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ యొక్క కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి.. ఆ సమయంలో ఇతర డినామినేషన్లలోని ( రూ. 1000, రూ. 500 ) నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత 2000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరింది. దీంతో 2018-19లో 22000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది. 2000 నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేయబడ్డాయి మరియు వాటి అంచనా జీవితకాలం 4-5 సంవత్సరాల ముగింపులో ఉన్నాయి. మార్చి 31, 2018 నాటికి (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3%) గరిష్టంగా ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ 26.73 లక్షల కోట్ల నుంచి 3.62 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ విలువ సాధారణంగా లావాదేవీలకు ఉపయోగించబడదని కూడా గమనించబడింది. ఇంకా, ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా కొనసాగుతోంది. “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం, 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించబడింది. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి. RBI 2013-2014లో చలామణి నుండి ఇదే విధమైన నోట్ల ఉపసంహరణను చేపట్టిందని గమనించవచ్చు.
దీని ప్రకారం, ప్రజలు 22000 బ్యాంకు నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో మార్చుకోవచ్చు.
కార్యాచరణ సౌలభ్యాన్ని నిర్ధారించడానికి మరియు సాధారణ అంతరాయాన్ని నివారించడానికి బ్యాంకు శాఖల కార్యకలాపాలు, 22000 నోట్లను ఇతర బ్యాంకు నోట్లలోకి మార్చడం.. డినామినేషన్‌లను ప్రారంభించి ఏదైనా బ్యాంక్‌లో ఒకేసారి రూ. 20,000 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. కసరత్తును సమయానుకూలంగా పూర్తి చేయడానికి మరియు ప్రజలకు తగిన సమయాన్ని అందించడానికి, అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు 2000 నోట్లకు డిపాజిట్ లేదా మార్పిడి సౌకర్యాన్ని అందించాలి. బ్యాంకులకు ప్రత్యేక మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేయబడ్డాయి. 2000 నోట్లను ఒకేసారి 220,000/- పరిమితి వరకు మార్చుకునే సదుపాయం కూడా మే 23, 2023 నుంచి జారీ చేయబడిన విభాగాలను కలిగి ఉన్న RBI యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాల (ROS) వద్ద అందించబడుతుంది. 2000 డినామినేషన్ నోట్లను తక్షణమే జారీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించింది. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలిపారు.
*రూ. 2000 నోట్ల రద్దుపై ప్రధాని లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు..
రూ. 2000 నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ చర్య ‘‘స్వయం శైలి విశ్వగురువు’’, ‘‘ఫస్ట్ యాక్ట్, సెకండ్ థింక్’’( మొదట చేసి, తర్వాత ఆలోచించడం) అతని పద్ధతి అని విమర్శించింది.2016 నవంబర్ 8న నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి విపత్తుకు నాంది పలికారని కాంగ్రెస్ పార్టీ కీలక నేత జైరాం రమేష్ అన్నారు. ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఆరోపించారు. 2016 నవంబర్ 8 ప్రకటనను ‘‘తుగ్లక్ ఫర్మానా’’గా అభివర్ణించారు. ఆ సమయంలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ. 2000 నోట్లను ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారని ఆయన అన్నారు. ‘‘సెకండ్ డెమో డిజాస్టర్ స్టార్.. M = మ్యాడ్ నెస్’’ అంటూ మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ₹ 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నోట్లను సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది.
*రూ. 2,000 నోటు రద్దు తర్వాత RBI వెబ్‌సైట్ క్రాష్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెల్లడించిన కొద్ది సేపటికే ఆర్బీఐ అధికార వెబ్‌సైట్ క్రాష్ అయింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ని సెర్చ్ చేయడంతో క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల నాటి ₹2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రకటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు పరుగులు తీయడంతో సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. అంతకుముందు, నవంబర్ 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా రూ. 500 , రూ. 1,000 నోట్లను రద్దు చేసిన తర్వాత భారీ ట్రాఫిక్ తర్వాత వెబ్‌సైట్ ఇలాగే క్రాష్ అయింది. ఈ ప్రకటనలు ఆ సమయంలో పెట్రోల్ పంపుల్లో, ఏటీఎంల ముందు భారీ క్యూలకు కారణం అయింది. రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ మార్పికి ప్రత్యేక సౌకర్యాలు అందించాలని ఆర్బీఐ బ్యాంకుల్ని కోరింది.
*గాఢ నిద్ర లేకపోతే పక్షవాతం, అల్జీమర్స్ ముప్పు
నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. మన దినచర్యలో భాగం. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు చురుకుగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యొక్క మెడికల్ జర్నల్ అయిన న్యూరాలజీలో ఈ కొత్త పరిశోధన ప్రచురించబడింది.‘స్లీప్ అప్నియా’’ మెదడులో మార్పులకు కారణం అవుతుందని అధ్యయనం నిరూపించింది. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. దీంట్లో శ్వాస పదేపదే ఆగిపోయి ప్రారంభమవుతుంది. మీరు గరక పెట్టడం, పూర్తిగా రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే మీకు స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఉంది. మెదడులోని తెల్లగా ఉండే పదార్థంలో బ్రెయిన్ బయోమార్కర్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని తెలియపరుస్తాయి. ఈ బయోమార్కర్లు సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి సంబంధించిన సంకేతాలను ఇస్తాయి. మెదడులో ఈ మార్పులకు ప్రస్తుతం చికిత్స లేదని అందువల్ల, ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి మార్గాలు కనుగొనాలని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న 140 మంది పాల్గొన్నారు, పాల్గొనేవారి సగటు వయస్సు 73 సంవత్సరాలు. అధ్యయనం ప్రారంభంలో పాల్గొన్న వారికి ఈ అధ్యయనంలో పాల్గొనే ముందు వారికి మతిమరుపు, ఏకాగ్రత, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం వంటి సమస్యలు లేవు. వీరలో 34 శాతం మంది తేలికపాటి, 32 శాతం మంది మధ్యస్థ, 34 శాతం మంది తీవ్రమైన స్లీప్ అప్నియా ఉంది. వీరంతా ఎంత సేపు గాఢ నిద్రలో ఉన్నారనే విషయాలను అధ్యయనం పరిశీలించింది. తేలికపాటి, మధ్యస్థ స్లీప్ అప్నియాతో ఉన్నవారి కన్నా తీవ్రమైన స్లీప్ అప్నియాతో ఉన్నవారిలో మెదడులోని వైట్ మ్యాటర్ లో హైపర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారి మెదడుల్లో నాడీ కణాలను అనుసంధానించే అక్సోనల్ ఇంటిగ్రిటీ కూడా తగ్గినట్లు తేలింది. వైట్ మ్యాటర్ హైపర్‌సెన్సివిటీస్ అనేది మెదడు స్కాన్‌లలో కనిపించే చిన్న గాయాలు.
*పవన్ కల్యాణ్ కు రూ.కోటి ఇచ్చిన నాగబాబు
ప్రస్తుతం రామచరణ్ గ్లోబల్ హీరోగా మారారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ హిట్లతో మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. RRR తర్వాత ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. రాబోయే చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు అయిన మార్చి 27న గతంలో ఆయన నటించి ఆశించిన ఫలితాన్ని అందుకోలేనపోయిన చిత్రం ఆరెంజ్ ను రీ రిలీజ్ చేశారు. ఆరెంజ్ సినిమా మొదట 26 నవంబర్ 2010న విడుదలైంది. ఈ చిత్రానికి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒకరిని మాత్రమే జీవితాంతం ప్రేమించలేం.. మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు.. అందుకే జీవితాంతం ప్రేమను పంచుకోవాలనే కొత్త స్టోరీలైన్ తో రూపొందింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బబ్లీ గర్ల్ జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా చాలా ప్రత్యేకం. అందుకే ఆరెంజ్ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. దీంతో సినిమా విడుదలైంది. మార్చి చివరి వారంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అప్పుడు చూడలేదు కానీ రీ రిలీజ్ టైంలో ఈ సినిమాను మరోసారి థియేటర్‌లో చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. రూ. ఈ క్రమంలో 1.05 కోట్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రీ-రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బును మెగా బ్రదర్, ఆరెంజ్ సినిమా నిర్మాత నాగబాబు ఈ డబ్బును జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్కు రూపంలో అందజేశారు. ఈ విషయాన్ని జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే రెండోసారి ఆరెంజ్ చిత్రాన్ని విడుదల చేసి ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్కేఎన్, శివచెర్రి, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు.
*పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 బంతుల్లో (189) రాజస్థాన్ ఛేధించింది. పడిక్కల్ (51), యశస్వీ (50), షిమ్రాన్ హెట్‌మేయర్ (46) పరుగులతో రాణించడంతో.. రాజస్థాన్ ఈ గెలుపును సొంతం చేసుకోగలిగింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించగా.. రాజస్థాన్ తన ప్లేఆఫ్స్ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. అయితే.. ఇది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తమతమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది. లేకపోతే.. ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సామ్ కర్రన్ (49), జితేశ్ శర్మ (44), షారుఖ్ ఖాన్ (41) మెరుగైన ఇన్నింగ్స్‌తో రాణించడంతో.. పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. తొలుత ఆర్ఆర్ జట్టుకి జాస్ బట్లర్ (డకౌట్) వికెట్ రూపంలో పెద్ద ఝలక్ తగిలినా.. ఆ తర్వాత జైస్వాల్, పడిక్కల్ అద్భుతంగా రాణించి తమ జట్టుని ఆదుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. అప్పుడు బరిలోకి దిగిన షిమ్రాన్ హెట్‌మేయర్ తన బలం చూపించాడు. పంజాబ్ బౌలర్లపై అతడు తాండవం చేశాడు. మైదానంలో కాసేపు బౌండరీల మోత మోగించి.. జట్టుని లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లాడు.షిమ్రాన్ ఈ మ్యాచ్ ముగిస్తాడని అనుకుంటే.. అతడు ఊపులో అనవసరమైన షాట్ కొట్టి, క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి మూడు బంతులకు 4 పరుగులు తీశారు. ఇక నాలుగో బంతికి సిక్స్ కొట్టి.. ధృవ్ జురేల్ తన జట్టుని గెలిపించాడు. పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. రబాడా రెండు వికెట్లు తీయగా.. కర్రన్, అర్ష్‌దీప్, నథన్ ఎల్లిస్, రాహుల్ చహార్ తలా వికెట్ పడగొట్టారు.