CM KCR: దశాబ్ధి ఉత్సవాల ఖర్చులకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం డా.బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డీజీపీ, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సీఎం వివరించారు.మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమ విరామం తర్వాత సమావేశం తిరిగి కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!