Kadapa Crime: ప్రేమపేరుతో పెట్రోల్ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి
- యువకుడి చేతిలో గాయపడ్డ విద్యార్థిని మృతి
- ప్రేమపేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Crime: ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బద్వేల్ సమీపంలోని పీపీ కుంట వద్ద ఉన్న సెంచరీ ప్లై వుడ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి విఘ్నేష్ అనే యువకుడు నిప్పటించాడు. ఈ ఘటనలో దాదాపు 80 శాతం కాలిపోయిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Attack on Inter Student: భార్య వద్దు నీవే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
Also Read
అసలేం జరిగిందంటే. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్ లో నివాసం ఉంటున్నారు దస్తగిరమ్మ కుటుంబం. అదే కాలనీ అదే వీటికి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత కొంతకాలంగా దస్తగిరమ్మను ప్రేమిస్తున్నాను అంటూ వేధించేవాడు. ఇదే విషయమై పలుసార్లు దస్తగిరమ్మ తల్లిదండ్రులు విఘ్నేష్‌ను మందలించారట. అటు తరువాత మరో అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి వివాహం చేసుకున్నాడు. ఒకపక్క ఒక అమ్మాయిని ప్రేమిస్తూ మరో పక్క మరో అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. ఆరు నెలల క్రితం విమల అనే అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి వివాహం చేసుకున్నాడు విఘ్నేష్.. అంతటితో ఆగకుండా బద్వేల్ పట్టణం లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మ అనే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ నీవు లేకుంటే నేను బ్రతకలేను అని బెదిరించేవాడు . శుక్రవారం,శనివారం నేను నీతో మాట్లాడాలి రా అంటూ బాలికను బెదిరించడం తో అతనితోపాటు అడవిలోకి వెళ్ళింది.అడవిలోకి తీసుకెళ్లి తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. నీకు వివాహం అయ్యింది ఆరు సంవత్సరాల తర్వాత ఆమెను వదిలేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ బాలిక చెప్పడంతో ఆగ్రహ వేషానికి లోనైన విఘ్నేష్ ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతూ మైనర్ బాలిక ప్రాణాలు విడిచింది.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!