Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఆర్జిత సేవా టికెట్ల కోటా పూర్తి కాగా.. ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరగనుంది. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నారు.
Read Also: Astrology: అక్టోబర్ 20, ఆదివారం దినఫలాలు
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. ఇక, నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు.. 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.