నీలి చిత్రాలు అందించే పోర్న్ హబ్ ఓ విచిత్ర విజ్ఞప్తి చేసింది. తమపై ఒత్తిడి తేవడానికి బదులు, పోర్న్ అంటే బోరింగ్ అనేలా.. నీలి చిత్రాలను సాధారణ విషయంగా మార్చడం గురించి ఆలోచించాలని ప్రభుత్వాలను కోరింది.
కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్‌ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్‌ను నాశనం చేసినందుకు "ప్రతీకార యుద్ధం" అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మే 9 హింసాత్మక నిరసనల సందర్భంగా సైనిక స్థావరాలను రక్షించడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్‌తో సహా ముగ్గురు అధికారులను తొలగించింది.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కచ్చితంగా చంపేస్తామని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డ్ బ్రార్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు.
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి.
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల''ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన తెలిపింది
ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్‌లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.