Pakistan Army: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మే 9 హింసాత్మక నిరసనల సందర్భంగా సైనిక స్థావరాలను రక్షించడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్‌తో సహా ముగ్గురు అధికారులను తొలగించింది. “స్వీయ జవాబుదారీ ప్రక్రియ”లో భాగంగా పలువురు ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారుల నిరసనలపై సైన్యం రెండుసార్లు సోదాలు నిర్వహించి చర్యలు చేపట్టిందని మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అర్షద్ షరీఫ్ తెలిపారు.
Also Read: Kissing Street: ఆ గల్లీకి వెళ్తే ముద్దులే ముద్దులు.. ఈ కిస్సింగ్ స్ట్రీట్ ఎక్కడో తెలుసా..?
మే 9న, ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు లాహోర్ కార్ప్స్ కమాండర్ హౌస్, మియాన్‌వాలి ఎయిర్‌బేస్, ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ భవనంతో సహా 20కి పైగా సైనిక స్థావరాలను, ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం (జీహెచ్‌క్యూ)పై కూడా మూక దాడి చేసింది. “ఉద్దేశపూర్వక జవాబుదారీ ప్రక్రియ తర్వాత, కోర్టు విచారణల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, గార్రిసన్‌లు, సైనిక స్థావరాలు, జిన్నా హౌస్, జనరల్ హెడ్‌క్వార్టర్‌ల భద్రత, గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించబడ్డాయి. ముగ్గురు అధికారులతో సహా లెఫ్టినెంట్ జనరల్‌ను తొలగించారు. ముగ్గురు మేజర్ జనరల్‌లు, ఏడుగురు బ్రిగేడియర్‌లతో సహా ఇతర అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి, ”అని సైన్యం తెలిపింది.
Also Read: Modi America Tour: భారత్‌లో అమెరికా యాపిల్స్, వాల్‌నట్స్-బాదం పప్పులు చౌక.. కారణమదే..!
మే 9 హింసలో పాల్గొన్న వారందరూ రాజ్యాంగం, చట్టం ప్రకారం శిక్షించబడతారని అని మేజర్ జనరల్ అర్షద్ షరీఫ్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ నిరసనలు మన దేశ చరిత్రలో ఒక మాయని మచ్చ అని ఆయన అభివర్ణించారు. మే 9 నాటి సంఘటనలు 76 సంవత్సరాలలో శత్రువులు ఏమి చేయలేరని నిరూపించాయని, కొంతమంది దుర్మార్గులు, వారి సహాయకులు ఈ పని చేశారని ఈ సంఘటనను “పాకిస్తాన్‌పై కుట్ర”గా అభివర్ణించారు.