Crime News: గోవాలో కదులుతున్న రైలులో మైనర్ బాలికపై 37 ఏళ్ల వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) నుంచి కేరళలోని కొచ్చువేలికి రైలు వెళ్తుండగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుందని, గోవాలోని కొంకణ్ రైల్వే విభాగానికి చెందిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Also Read: Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. చెన్నైలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు
బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉత్తర గోవాలోని పెర్నెమ్ సమీపంలో కదులుతున్న రైలులో నిందితులు బాలికపై వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. బాలిక తన కుటుంబంతో కలిసి మంగళూరుకు ప్రయాణిస్తోందని, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న నిందితుడు కూడా తన కుటుంబంతో కలిసి అదే రైలులో ఉన్నాడని అధికారి తెలిపారు.