Char Dham Yatra: నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర.. అధికారులకు సీఎం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.”మార్గమధ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను నిలిపివేసింది. హిమపాతం, వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.” అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
Also Read: Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇదిలావుండగా, రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, టెహ్రీ గర్వాల్ జిల్లాల్లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సోమవారం అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలో వర్షాల పరిస్థితికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, వర్షాల పరిస్థితి, నీటి ఎద్దడి, వర్షాల కారణంగా సంభవించిన నష్టాల గురించి సీఎం ధామి డిజాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం తెలుసుకున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం గత 24 గంటల్లో హరిద్వార్‌లో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర పరిధిలోని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని, ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. విపత్తు సహాయం, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!