Goldy Brar: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కచ్చితంగా చంపేస్తామని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డ్ బ్రార్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు. నటుడు తన సన్నిహితుడు అందుకున్న బెదిరింపు ఇ-మెయిల్‌లతో పోలీసులను ఆశ్రయించిన నెలల తర్వాత గోల్డీ బ్రార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బ్రార్ గ్యాంగ్ గత ఏడాది మేలో పంజాబీ గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ
మేము సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తామని.. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ, సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నాడు. “మేము ముందే చెప్పినట్లు, ఇది సల్మాన్ ఖాన్ గురించి మాత్రమే కాదు. జీవించి ఉన్నంత కాలం శత్రువులందరిపై మా ప్రయత్నాలను కొనసాగిస్తాము. సల్మాన్ ఖాన్ మా టార్గెట్, అందులో ఎలాంటి సందేహం లేదు. మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. మేము విజయం సాధించినప్పుడు, మీకు తెలుస్తుంది, ” అని బ్రార్ చెప్పాడు.
Also Read: Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?
మార్చిలో, సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఇ-మెయిల్‌కు సంబంధించి గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని, లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూను సూచించాడని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు పంపిన ఇ-మెయిల్ పేర్కొంది. ఆ ఈ-మెయిల్‌లో ఇలా ఉంది. “గోల్డీ బ్రార్ మీ బాస్ (సల్మాన్ ఖాన్)తో మాట్లాడాలనుకుంటున్నారు. అతను తప్పనిసరిగా బిష్ణోయ్ ఇంటర్వ్యూని చూసి ఉండాలి. అతను చూడకపోతే చూసేలా చేయండి. ఈ విషయం ఇంతటితో ముగియాలంటే సల్మాన్ గోల్డీబ్రార్‌తో మాట్లాడాలి. అతను మాట్లాడాలంటే మాకు చెప్పండి.” అంటూ ఆ మెయిల్‌లో వచ్చింది. అనంతరం పంపిన వ్యక్తి – రోహిత్ గార్గ్, గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై నటుడి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.