దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) దాటి భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు సాయుధ పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా దళాలు కాల్చిచంపాయని ఆర్మీ శనివారం తెలిపింది.
పారామిలటరీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో శనివారం నైరుతి పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.
కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్(GEMCOVAC-OM) అనేది భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్.
ఒక ఇస్లామిస్ట్ సంస్థ నాయకుడిని ఢాకాలోని అతని రహస్య స్థావరం వద్ద బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సమూహంపై అణిచివేత ప్రారంభించిన నెలల తర్వాత శనివారం అధికారులు తెలిపారు.
పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తన 2 రోజుల పర్యటన కోసం ఈజిప్టు రాజధాని కైరోలో దిగిన తర్వాత ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
శుక్రవారం బీహార్‌లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.