నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం పైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్(33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి.. ఎంఎస్ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న నాగప్రసాద్‌కు ఫణికుమార్ రూమ్‌మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు.
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది.