తెలంగాణలో కులమత సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరి, సోదరిమణులు పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డును సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డును సాధించాడు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాఫ్ రూం తాళం పగలగొట్టి కొందరు దుండగులు పాఠశాల రికార్డులను తగలబెట్టారు. గదిలో రికార్డులు, పరీక్ష పత్రాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి చొరబడి పాఠశాల రికార్డులను ధ్వంసం చేశారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మునీర్ అహ్మద్ అనే టీచర్ క్లాస్ రూమ్‌లో ఉండగా ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. టీచర్‌ను తీసుకెళ్లింది పోలీసులని నిర్ధారణ అయింది. సీఐ పిలుస్తున్నాడని బలవంతంగా కారులో తోసుకుని ఇద్దరు మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.
గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లోనే ప్రసవించడంతో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు.