Agnipath Scheme: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రివిద దళాల్లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వాళ్లని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు ఉపయోగపడేలా పలు కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
అగ్రివీర్ల కాల పరిమితిని అలాగే వారి వయస్సును పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇందులో ఎంపికైన యువతలో కేవలం 25 శాతం మందికే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యులర్ క్యాడర్‌లో తీసుకోనున్నారు. అయితే దీనిని ఇప్పుడు ఈ 25 శాతం నుంచి 50 శాతానికి ఆర్మీలోని రెగ్యులర్ క్యాడర్‌లలో తీసుకొనేలా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Gold Smuggling: సూరత్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
జూన్ 2022లో ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5-21 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్‌ల పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. మరోవైపు సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో వయోపరిమితిని సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 21 ఏళ్ల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయి. గరిష్ట వయో పరిమితిని సవరించడం, దానిని 23 ఏళ్లకు పెంచడంపై చర్చ జరుగుతోంది. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది.
Also Read: Delhi Rains: 36 గంటలుగా ఢిల్లీలో వర్షాలు.. అప్రమత్తమైన కేంద్రం..!
ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకం కింద త్వరలో అగ్నివీరులు త్వరలో వివిధ యూనిట్లలో చేరనున్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ ముగియగా, రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభమైంది. వచ్చే నెలలో మొదటి బ్యాచ్ ఇండియన్ ఆర్మీలో చేరనుంది. అయితే, శిక్షణ సమయంలోనే చాలా మంది యువకులు మధ్యలోనే వెళ్లిపోయారు. వివిధ కారణాలను చూపుతూ, సైన్యానికి వీడ్కోలు పలికిన యువకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శిక్షణ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా వారి నుండి రికవరీ చేస్తారు. ప్రస్తుతం ఆర్మీలో శిక్షణను మధ్యలోనే వదిలేయాలనే నిబంధన లేదని, ఇప్పుడు దాన్ని అరికట్టేందుకు కొత్త రూల్స్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొదటి బ్యాచ్‌లో 50 మందికి పైగా యువకులు శిక్షణను మధ్యలోనే వదిలేశారని, రెండో బ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని నివేదికలో ఓ అధికారి చెప్పారు.