పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సలహా మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పొత్తు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ శనివారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు.
రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన బహిరంగ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్ అని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.
జాతి హింసకు గురైన రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్న వారికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని మణిపూర్ హైకోర్టు ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం నాడు కేంద్రాన్ని హెచ్చరించారు. ఇది అన్ని మతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడం ఆర్టికల్ 370 ని రద్దు చేసినంత సులభం కాదని కూడా అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో శనివారం జరిగిన ముడిబాంబు పేలుడులో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆ పిల్లలు దానిని బంతి అని తప్పుగా భావించి ముడిబాంబును రోడ్డు పక్కన నుంచి తీయడంతో ఈ పేలుడు జరిగింది.
ఐరోపా దేశమైన స్పెయిన్‌ను వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. తీవ్రమైన తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాల వల్ల జరాగోజా నగరంలో వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షం కారణంగా అనేక వీధులు జలమయమయ్యాయి.
ఏక్‌నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు.
గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు.. కదిలే కారులో అతడిని చితకబాది బలవంతంగా అతడితో పాదాలు నాకించి వికృతంగా ప్రవర్తించారు.
అజిత్ పవార్ తనపై చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం బదులిచ్చారు. సోదరుడి కుమారుడైన అజిత్ పవార్‌పై విరుచుకుపడ్డారు. 'రిటైర్' అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని, రిటైర్మెంట్ తీసుకోనని, తనలో ఇంకా ఫైర్ అలాగే మిగిలి ఉందని అన్నారు.