టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వివేకా కేసు తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
బిగ్‌బాస్ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది.
ఏపీలో మహిళల మిస్సింగ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారని.. దానిపై పవన్ వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు.
కేంద్రంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.