శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం నిర్ణయించింది. శ్రావణమాస పర్వదినాలలో రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేసినట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం మరోసారి భూకంపం సంభవించింది. ఐదు రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి. సాయంత్రం 6:09 గంటలకు భూకంపం సంభవించింది.
"మహాభారతంలో కూడా లవ్ జిహాద్ జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆయన సాధారణ ప్రజలను క్షమాపణ అడగడానికి వైష్ణవ్ ప్రార్థనకు సంబంధించిన ఓ గీతాన్ని కూడా పాడాడు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు.
ఇటీవల ప్రేమకోసం ప్రేమికులు దేశ సరిహద్దులను దాటి.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి రిస్క్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను అధిగమించి దేశ సరిహద్దులను కూడా దాటిపోతున్నారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే
ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది.
కర్ణాటక ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని వీడియోలను మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ఎల్గార్ పరిషత్ కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు కార్యకర్తలు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం నేరాలకు పాల్పడినందుకు వీరిద్దరూ ఆగస్టు 2018 నుంచి జైలులో ఉన్నారు.
రాజస్థాన్‌లోని అల్వార్‌లో హిందూ విద్యార్థులు తమ నుదుటిపై తిలకం పెట్టడాన్ని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పడంతో రెండు వర్గాల సభ్యులు గురువారం ఘర్షణకు దిగారు. చోమ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఘర్షణకు దిగారు.
గత నెలలో అహ్మదాబాద్‌లో టెయిల్ స్ట్రైక్ చేసినందుకు ఎయిర్ క్యారియర్ నుండి ఇద్దరు పైలట్‌లను సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత, 6 నెలల్లో నమోదైన 4 టెయిల్ స్ట్రైక్స్ కోసం ఇండిగోకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రూ. 30 లక్షల జరిమానా విధించింది.