Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.
రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జూర నాయుడివా, నువ్వు దానకర్ణుడివా, సింగపూర్ వాళ్లకు ఎలా దోచి పెట్టావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ఆరోపణలు చేశారు. ఎలా రైతుల నుంచి రాజధాని కోసం లాక్కున్నారంటూ ప్రశ్నించారు. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆమె ఆరోపించారు. గంజాయి పంట రాష్ట్రంలో బాగా పండుతోందని అంటున్న చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో మాజీ మంత్రి గంటా గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు అని స్వయంగా చెప్పారని ఆమె అన్నారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Also Read: Andhrapradesh: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండు సార్లు దొరికారు, జైలుకు కూడా వెళ్ళారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయి సాగును ఇనుప పాదంతో అణచి వేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏనాడూ ప్రజారోగ్యం గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. “నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకు వచ్చారు. 64 కోట్లతో పుత్తూరు అభివృద్ధికి ఖర్చు చేశాను, కోట్లాది రూపాయలు అభివృధి పనులు చేస్తున్నా. నాకు డబ్బులు వచ్చే పనులు నేను చేయను, ప్రజలకు అవసరమైన పనులు, పార్కులు, అభివృద్ధి చేస్తున్నాను. ఎవరిని అడిగి పుత్తూరు మున్సిపాలిటీ చేశారు, దీని వల్ల ప్రజలపై పన్నుల భారం చేసింది టీడీపీనే. గత ప్రభుత్వ హయాంలో స్మశానాన్ని కూడా కబ్జాలు చేశారు. తెలుగు గంగ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి తీసుకు వస్తాం. పుత్తూరు – నగరి మధ్య నాలుగు లైన్‌ల జాతీయ రహదారి పనులు అభివృధ్ది చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.” అని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!