Minibus Accident: ఆఫ్రికాలోని మొరాకో దేశంలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొరాకోలోని అజిలాల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 24 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. డెమ్నాట్ పట్టణంలోని వీక్లీ మార్కెట్‌కు ప్రయాణీకులను తీసుకెళ్తున్న మినీబస్సు బోల్తా పడడంతో వారు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. విచారణ ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మొరాకో, ఇతర ఉత్తర ఆఫ్రికా దేశాల రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్చి 11న బ్రాచౌవా పట్టణంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన తర్వాత వారి మినీబస్సు చెట్టును ఢీకొనడంతో ప్రజలు, ఎక్కువగా వ్యవసాయ కార్మికులు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. చాలా మంది పేద పౌరులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించడానికి కోచ్‌లు, మినీబస్సులను ఉపయోగిస్తారు. గత ఏడాది ఆగస్టులో మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాకు తూర్పున బస్సు బోల్తా పడడంతో 23 మంది మరణించగా.. 36 మంది గాయపడ్డారు.
Also Read: Viral Video: ఏ మాత్రం భయంలేనట్టుంది ఈ పిల్లకు.. ఎంత ఈజీగా పాములను పట్టేసుకుందో..!
నేషనల్ రోడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం, మొరాకోలో సంవత్సరానికి సగటున 3,500 రోడ్డు మరణాలు, 12,000 గాయాలు నమోదవుతున్నాయి, సగటున రోజుకు 10 మరణాలు సంభవిస్తున్నాయి. గతేడాది మరణాల సంఖ్య దాదాపు 3,200గా ఉంది. 2012లో దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదంలో 42 మంది మరణించినప్పటి నుంచి 2026 నాటికి మరణాల రేటును సగానికి తగ్గించాలని అధికారులు నిర్ణయించారు.