Meher Ramesh: మెగాస్టార్ ఇచ్చిన పునర్జన్మ ఇది.. డైరెక్టర్‌గా మళ్లీ పుట్టాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meher Ramesh in Bhola Shankar Prerelease Event: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికాగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. తాను కూడా మెగా అభిమానుల్లో నుంచి వచ్చానని భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ అన్నారు. మెగాస్టార్ సినిమా చేయడం అనేది ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానన్నారు. షాడోలో ఉన్న తన మీద మెగాస్టార్ వెలుగు పడిందని.. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. డైరెక్టర్‌గా ఈ సినిమా మెగాస్టార్ తనకిచ్చిన పునర్జన్మ లాంటిదని ఆయన చెప్పారు. తానెంత ఫ్యాషన్‌తో ఈ సినిమా చేశానో.. నిర్మాత అనిల్ సుంకర అంతే నమ్మకంతో ప్రొడ్యూస్ చేశారని డైరెక్టర్ మెహర్ రమేష్ పేర్కొన్నారు. నిర్మాతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Hyper Aadi : హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలే ఆయనకి ఫ్యాన్స్..
Also Read
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు బాస్‌తో సినిమా చేద్దాం అని నిర్మాతతో అన్నానని.. అదే ఇప్పుడు నిజమైందని దర్శకుడు మెహర్ రమేష్ పేర్కొన్నారు. కల నిజమైనందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమా కూడా అనుకున్న విధంగానే ఎంతో అద్భుతంగా వచ్చిందన్నారు. చిరంజీవి అభిమాని అంటేనే ఒక గుర్తింపు వచ్చిన రోజు నుంచి వచ్చినవాడినన్నారు. చిరంజీవితో బంధుత్వం ఉందని అంటేనే చాలా అదృష్టంగా భావిస్తామన్నారు. అన్నయ్యను తలవని రోజు లేదంటూ మెగాస్టార్ మీద ఉన్న అభిమానాన్ని ఆయన వేదికపై ప్రదర్శించారు. ఇవాళ డైరెక్టర్‌గా భోళాశంకర్ సినిమా మెగాస్టార్‌తో చేయడం ఆయన తనకిచ్చిన పునర్జన్మగా భావిస్తునన్నారు. రౌడీఅల్లుడు, గ్యాంగ్ లీడర్ సినిమాల తర్వాత చిరంజీవి సినిమాల్లో భోళాశంకర్ అనేలా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని చూపించుకోవడానికి ఈ జన్మ సరిపోదన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!