Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
- టైరు పగిలి లారీని ఢీకొట్టిన కారు
- ఈ ఘటనలో ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం. అనంతపురం – కడప హైవేపై ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి నగరంలో ఇస్కాన్ నగర సంకీర్తనకి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురంకు కారు వస్తోంది. మృతులు సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Manoj Sinha: “ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం”.. ఉగ్రవాదులకు హెచ్చరిక
Also Read
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శింగనమల మండలం నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురంనకు చెందిన ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజావార్తలు
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..