చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కరెంటు కోతతో దేశం మొత్తం అతలాకుతలమైంది. కెన్యాలో శుక్రవారం రాత్రి విద్యుత్ నిలిచిపోయింది. ఏకంగా 14 గంటల పాటు కరెంటు కటకట ఏర్పడింది. ఇటీవలి సంవత్సరాలలో దేశంలోనే అత్యధిక విద్యుత్ కోత ఇదేనని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది.
పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. పెరిగిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విద్యుత్ ధరలకు సంబంధించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో నేడు ప్రపంచం మొత్తం భారతీయ శాస్త్రవేత్తలను కొనియాడుతోంది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించి తదుపరి మిషన్‌ను ప్రోత్సహించారు.
కొత్తగా నియామకమైన 51,000 మంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 28న ఈ కార్యక్రమం జరగనుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు.
భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ పండుగ అన్నా చెల్లె, తమ్ముడు అక్కల మధ్య బంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను తెలుపుతుంది. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.