Rozgar Mela: కొత్తగా నియామకమైన 51,000 మంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 28న ఈ కార్యక్రమం జరగనుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, ప్రధాని మోదీ జూలై 22న 70,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 28న పంజాబ్‌లో కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) తెలిపింది. బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ఎనిమిదో విడత అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీని జలంధర్‌లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమక్షంలో ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు.
Read Also: Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని మోడీ కొత్త వేగం, శక్తిని అందించారు..
అంతకుముందు, ప్రధాని మోడీ జూలై 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 70,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని మోడీ తన వర్చువల్ ప్రసంగంలో చెప్పారు. ప్రభుత్వోద్యోగిగా పనిచేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు. వచ్చే 25 ఏళ్లు భారతదేశానికి చాలా ముఖ్యమైనవని ఈ కార్యక్రమంలో ప్రధాని అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుందని, అంటే ఉపాధి అవకాశాలు, పౌరుని తలసరి ఆదాయం పెరుగుతాయని ప్రధాని ఆ సమయంలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 44 చోట్ల ఉపాధి మేళాను నిర్వహించనున్నారు. రిక్రూట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వ శాఖలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చొరవకు మద్దతు ఇస్తున్నాయి. రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా ఒక అడుగు.