Chandrayaan-3: చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. “ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది.” అని ట్విటర్ వేదికగా చెప్పింది.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన ప్రాంతాన్ని ఇక నుంచి ‘శివశక్తి’ పాయింట్‌గా పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన ఆగస్టు 23ని ఇప్పుడు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పిలుస్తామని ఆయన చెప్పారు. బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కమాండ్ సెంటర్‌లో చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఉద్వేగభరితమైన ప్రధాని మోదీ వారి ప్రయత్నాలను ప్రశంసించారు.”ఆగస్టు 23న భారతదేశం చంద్రునిపై జెండాను ఎగురవేసింది. ఇక నుంచి ఆ రోజును భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పిలుస్తాము” అని ప్రధాని మోదీ అన్నారు. తాను ఓ కొత్త రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. శరీరం, ఆత్మ మొత్తం ఆనందంలో మునిగిపోయే సందర్భాలు చాలా అరుదు అని బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు.
Read Also: Karnataka High Court: ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షల్లేవ్..
చంద్రయాన్ 3 విజయవంతం కావడం వల్ల స్వదేశీ ఉత్పత్తికి ఊతమివ్వడాన్ని ప్రస్తావిస్తూ శాస్త్రవేత్తలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారని ఆయన అన్నారు. తాను దక్షిణాఫ్రికా మరియు గ్రీస్‌లో రెండు దేశాల పర్యటనలో ఉన్నానని, అయితే తన మనస్సు పూర్తిగా శాస్త్రవేత్తలపైనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. వీలైనంత త్వరగా శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేయాలన్నారు. “ఆగస్టు 23 ఆ రోజులోని ప్రతి సెకను నా కళ్ల ముందు చూడగలుగుతున్నాను.” చంద్రయాన్-3 చివరి 15 సవాలు నిమిషాలను గుర్తుచేసుకుంటూ ప్రధాని మోదీ అన్నారు. “నేను మీ అంకితభావానికి నమస్కరిస్తున్నాను. నేను మీ సహనానికి నమస్కరిస్తున్నాను. నేను మీ కష్టానికి నమస్కరిస్తున్నాను. నేను మీ స్ఫూర్తికి నమస్కరిస్తున్నాను” అని ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉదయం ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. చంద్రయాన్ -3 లో పాల్గొన్న శాస్త్రవేత్తల బృందాన్ని ఆయన కలుసుకున్నారు. ఇస్రో చీఫ్ సోమనాథ్‌ను కౌగిలించుకున్నారు.
Chandrayaan-3 Mission:
🔍What's new here?Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
— ISRO (@isro) August 26, 2023