ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన వార్షిక ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు 3.7 కోట్ల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌కు ఎంపికయ్యారు. ఇదే ఐఐటీ బాంబే హైయెస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆఫర్ కావడం గమనార్హం.
కేరళలో తాజా నిఫా వైరస్ వ్యాప్తికి సంబంధించి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, హైరిస్క్ కాంటాక్ట్‌ల నుంచి 200 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం కేరళలో తెలిపారు. ఇప్పటివరకు 1,233 కాంటాక్టులను గుర్తించామని, అందులో అధిక రిస్క్, తక్కువ రిస్క్ కాంటాక్టులుగా వర్గీకరించామని చెప్పారు.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రేపటి(మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో కొనసాగనున్నాయి. అయితే రేపటి నుంచి ఎంపీలు కొత్త పార్లమెంట్‌కు మారనున్నారు. అక్కడ ఎంపీలు మాట్లాడే మైక్‌లన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్‌తో పని చేస్తాయని సమాచారం.
కారణం లేకుండా జీవిత భాగస్వామి ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణాలు లేకుండా శృంగారానికి దూరం పెట్టడం క్రూరత్వంతో సమానం అని కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.
బీజేపీ ఎలాంటి పొత్తు లేదని, ఎన్నికల సమయంలోనే ఎన్నికల పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు సోమవారం తారాస్థాయికి చేరుకున్నాయి.
రేపటి(మంగళవారం) నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మారనున్నాయి. పాత పార్లమెంట్ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో సహా కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కాగా.. కొత్త పార్లమెంట్ భవనం మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలకు వేదిక కానుంది.