ఇటలీలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రకారం, దాని భూకంప కేంద్రం ఫ్లోరెన్స్‌కు ఈశాన్యమైన మరాడి సమీపంలో ఉందని నివేదించింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ జరగనుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి నూతన భవనంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగిస్తూ జీ20 సదస్సుపై ప్రధాని మోడీ చర్చించారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు.
ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్‌లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు.
రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంత్ కుబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం, ఇతర రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడినందు వల్లే సీఐడీ అరెస్ట్ చేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో తట్టుకోలేని టీడేపీ నేతలు ప్రభుత్వాన్ని, న్యాయవాదులను, న్యాయమూర్తులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.