BSF Jawan Suicide: భార్య మరణవార్త విని బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSF Jawan Suicide: భార్య మరణవార్త తెలియడంతో సరిహద్దు భద్రతా దళం(BSF) జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ బీఎస్‌ఎఫ్ జవాను ఫోన్‌లో తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఉన్న తన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం కశ్మీర్‌లోని బీఎస్‌ఫ్ జవాన్‌కు తెలియడంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వీరికి ఎనిమిది నెలల క్రితం వివాహమైంది.
Also Read: Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా రూ. 1.5 కోట్లు.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలోని ధీర్‌పూర్ గ్రామానికి చెందిన అన్షు యాదవ్ (24) మంగళవారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఆమె మృతి గురించి సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర యాదవ్ (28) తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వారు వెల్లడించారు.
Also Read: Dhimahi Trailer: చనిపోయిన వాళ్ళతో మాట్లాడచ్చా?..వణికిస్తోన్న ధీమహి ట్రైలర్
పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలోని హర్సౌరా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజేష్ మీనా పేర్కొన్నారు. ఫోన్‌లో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని మీనా తెలిపారు. రాజేంద్ర యాదవ్ మృతదేహాన్ని గురువారం జైపూర్ తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అన్షు యాదవ్, రాజేంద్ర యాదవ్ ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారని రాజేష్ మీనా తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్) సెక్షన్ 176 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును సబ్ డివిజనల్ అధికారికి అప్పగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!