ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోంది. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
కొంతగాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు వారి 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల 11.07 లక్షల మంది జాతీయ రవాణా సంస్థలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది.
రాజవంశ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజకీయ పరిజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అని రాహుల్ గాంధీని విమర్శించారు.
దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో 'న్యూస్‌క్లిక్' వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
మహిళల వివాహ వయస్సును ప్రస్తుత 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు తాజాగా మూడు నెలల గడువును పొడిగించింది.
2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు.
హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది.